ఇంగ్లాండ్ లో సరస్సుపై అడ్డగీతలా ఏర్పడిన ఇంద్రధనుస్సు రంగులు!

  • డెవాన్ లో నీటి ఉపరితలంపై అద్భుత దృశ్యం
  • తుపానుతో సముద్రం అలజడి
  • ఈ నీటిపై కాంతి వక్రీభవనం చెందిందన్న శాస్త్రవేత్తలు
సాధారణంగా ఆకాశంలో ఏర్పడే ఇంధ్రధనుస్సు విల్లు ఆకారంలో వంపు తిరిగి ఉంటుంది. హరివిల్లులో ఏర్పడే రంగులు కంటికి ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. అయితే ఇంగ్లాండ్ లో ఆశ్చర్యకరమైన రీతిలో నీటి ఉపరితలంపై ఇంధ్రధనుస్సులోని రంగులు ఆవిష్కృతమయ్యాయి. డెవాన్ లో ఇది జరిగింది. నీటి జల్లులపై కాంతి వక్రీభవనం వల్ల ఈ విధంగా ఏర్పడి ఉంటుందని బ్రిటన్ వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇటీవల సంభవించిన ఫ్రాన్సిస్ తుపాను కారణంగా సముద్ర జలాల్లో అలజడి ఏర్పడింది. ఈ సమయంలోనే నీటి జల్లులపై సూర్యకాంతి పడి ఫ్లాట్ గా ఇంధ్రధనుస్సు రంగులు ఏర్పడి ఉండొచ్చని వివరించారు.


More Telugu News