అమెరికా రికార్డు బద్ధలు... ఒక్కరోజులోనే 79 వేల కరోనా కేసులు!
- మరింతగా విజృంభిస్తున్న కరోనా
- 35 లక్షలు దాటిన మొత్తం కేసులు
- మహారాష్ట్రలో అత్యధికంగా 16 వేలకు పైగా కేసులు
ఇండియాలో కరోనా మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తోంది. ఒక రోజు కేసుల్లో అమెరికా రికార్డును ఇండియా బద్ధలు కొట్టింది. నిన్న ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 79 వేలకు పైగా కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35 లక్షలను దాటింది. గడచిన వారం రోజుల వ్యవధిలో దాదాపు 5 లక్షల కేసులు నమోదు కాగా, రోజుకు సగటున 70,867 కేసులు వచ్చాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికాలో ఈ మహమ్మారి విజృంభించిన జూలై చివరి వారంతో పోలిస్తే, ఇండియాలో గత వారం నమోదైన కేసులే అధికం కావడం గమనార్హం.
ఇక నిన్న మహారాష్ట్రలో అత్యధికంగా 16,867 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో 27 లక్షల మందికిపైగా కోలుకోగా, 945 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక కరోనా తగ్గిందని భావించిన దేశ రాజధానిలోనూ ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 1,954 కొత్త కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.