తల్లితో కలసి ఆర్జేడీలో చేరేందుకు సిద్ధమైన జాతీయ క్రీడాకారిణి శ్రేయాసీ సింగ్
- వచ్చే నెల 4న తన మద్దతుదారులతో సమావేశం
- అనంతరం ఆర్జేడీలో చేరిక ప్రకటన
- రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధం
బీహార్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి దివంగత దిగ్విజయ్ సింగ్ భార్య, మాజీ ఎంపీ పుతుల్ కుమారి సింగ్ తన కుమార్తె, జాతీయ షూటర్ శ్రేయాసీ సింగ్ తో కలసి లాలు ప్రసాద్ సారథ్యంలోని ఆర్జేడీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబరు 4న తన మద్దతుదారులతో సమావేశమైన అనంతరం చేరిక విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
తాను బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదని ఈ సందర్భంగా పుతుల్ సింగ్ పేర్కొన్నారు. కాగా, తన ఐదుగురు మద్దతుదారులతో కలిసి ఆర్జేడీలో చేరాలని నిర్ణయించుకున్న పుతుల్ సింగ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆమె కుమార్తె శ్రేయాసీ సింగ్ 2018లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో షూటింగ్‌లో బంగారు పతకం అందుకున్నారు.