ఏపీలో ఈ మూడు మద్యం కంపెనీలు ఎవరివి? తయారీదారులు ఎవరు?: దేవినేని ఉమ
- ప్రముఖ మద్యం బ్రాండ్లన్ని రాష్ట్రం నుంచి పరార్
- కొత్త, చెత్త, చీఫ్ బ్రాండ్లతో సామాన్యుడి ఆరోగ్యంతో ఆటలు
- షాక్ కొట్టే ధరల వెనక వేల కోట్ల రూపాయల దందా?
- నియంత్రణ పేరు సొంతబ్రాండ్ ల డిమాండ్ కోసమేనా?
ఆంధ్రప్రదేశ్‌లో అదాన్, ఎన్ఎస్జే, ఎస్పీవై డిస్టిలరీస్‌లో తయారవుతున్న మద్యాన్నే విక్రయిస్తున్నారంటూ 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేస్తూ ఏపీ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. పశ్చిమ గోదావరిలో ‘అదాన్ డిస్టిలరీస్’ మూడు నాలుగు నెలల కిందటే ఏర్పాటైందని, మద్యం మార్కెట్లో అధిక గిరాకీతో దుమ్మురేపుతోందని అందులో పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆ మద్యం కంపెనీలు ఎవరివని దేవినేని ఉమ నిలదీశారు.
'ప్రముఖ మద్యం బ్రాండ్లన్ని రాష్ట్రం నుంచి పరార్.. అవన్నీ మర్చిపోండి మేంపోసింది తాగండి.. కొత్త, చెత్త, చీఫ్ బ్రాండ్లతో సామాన్యుడి ఆరోగ్యంతో ఆటలు. షాక్ కొట్టే ధరల వెనక వేల కోట్ల రూపాయల దందా? నియంత్రణ పేరు సొంతబ్రాండ్ ల డిమాండ్ కోసమేనా? ఆ మూడు మద్యం కంపెనీలు ఎవరివి? తయారీదారులు ఎవరు? చెప్పండి వైఎస్ జగన్ గారు?' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.