పబ్జీ సహా 118 యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం

  • హానికర మొబైల్ యాప్ లపై కేంద్రం కఠినచర్యలు
  • దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయని వెల్లడి
  • టిక్ టాక్ ను గతంలోనే నిషేధించిన కేంద్రం
ఎంతోకాలంగా పబ్జీ గేమ్ ను నిషేధించాలని కోరుకుంటున్న వారి ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంది. అనేకమంది ప్రాణాలు పోవడానికి కారణమైన పబ్జీ గేమ్ తో పాటు 118 యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మొబైల్ యాప్ లు దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు, ప్రజా జీవితానికి హానికరంగా పరిణమించాయంటూ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్జీ, లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వుయ్ చాట్ వర్క్, వుయ్ చాట్ రీడింగ్ వంటి పలు యాప్ లు కేంద్రం విడుదల చేసిన నిషిద్ధ యాప్ ల జాబితాలో ఉన్నాయి. కేంద్రం ఇంతకుముందే టిక్ టాక్, హలో వంటి యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే.



More Telugu News