ఏపీ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు

  • ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికతో హోంశాఖ నిర్ణయం
  • మంత్రి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలన్న నిఘా వర్గాలు
  • ఇంటెలిజెన్స్ వర్గాల సూచనలు పాటిస్తున్న కన్నబాబు
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు హోంశాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. ఇంటెలిజెన్స్ శాఖ నివేదికతో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు వారం కిందట స్పష్టం చేశాయి.

కన్నబాబు ఇకపై బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని నిఘా వర్గాల నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కన్నబాబుకు సూచనలు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల సూచనలను పాటించాలని నిర్ణయించుకున్న కన్నబాబు, తన తాజా పర్యటనలకు కొత్తగా కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగిస్తున్నారు.


More Telugu News