చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న హర్భజన్ సింగ్!

  • ఇప్పటికే జట్టుకు దూరమైన రైనా
  • నేను ఆడలేనని స్పష్టం చేసిన భజ్జీ
  • వ్యక్తిగత కారణాల వల్ల ఆడలేనని వ్యాఖ్య
ఇప్పటికే స్టార్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. దీన్నుంచి ఇంకా కోలుకోక ముందే ఆ ఫ్రాంచైజీకి టాప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరో షాక్ ఇచ్చాడు. ఈ ఐపీఎల్ లో తాను ఆడబోవడం లేదని సీఎస్కే యాజమాన్యానికి తెలిపాడు.

వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ సీజన్ లో ఆడటం లేదని వెల్లడించాడు. సీఎస్కే జట్టు సభ్యులందరూ ఇప్పటికే యూఏఈకి వెళ్లారు. భజ్జీ మాత్రం ఇండియాలోనే ఉండిపోయాడు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే... భజ్జీ తాను ఆడలేనని ప్రకటించాడు. ఇప్పటికే సీఎస్కే జట్టును కరోనా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో, ఇద్దరు టాప్ ప్లేయర్లు దూరం కావడం ఆ జట్టుకు ఇబ్బందికర పరిణామమని చెప్పుకోవచ్చు.


More Telugu News