ఎన్టీఆర్ తో జతకట్టనున్న జాన్వీ కపూర్?
- జాన్వీ కోసం నిర్మాతల ప్రయత్నాలు
- త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం
- స్క్రిప్ట్ రెడీ.. ఏడాది చివర్లో సెట్స్ కి
- ప్రస్తుతం జాన్వీతో సంప్రదింపులు
శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు పేరుతెచ్చిపెట్టే చిత్రాలను ఎంపిక చేస్తూ ఆమె కెరీర్ని సరైన దిశలో పయనించేలా తండ్రి బోనీకపూర్ మంచి పునాది వేస్తున్నారు. మరోపక్క, ఈ అందాలబొమ్మ ఇంకా తెలుగులో ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ, అప్పుడే ఇక్కడ ఆమెకు చాలా క్రేజ్ వచ్చేసింది. ఆమెను తమ చిత్రాలలో బుక్ చేయాలని ఎప్పటినుంచో నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జాన్వీ త్వరలో తన తొలి తెలుగు చిత్రాన్ని అంగీకరించనుందని తెలుస్తోంది. అది కూడా ఎన్టీఆర్ వంటి మాస్ ఇమేజ్ విపరీతంగా వున్న హీరో సినిమా కావడం విశేషం. 'ఆర్ఆర్ఆర్' తర్వాత తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్టు ఇప్పటికే రెడీ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ కి వెళ్లే అవకాశం వుంది.
ఇదిలావుంచితే, ఇందులో కథానాయిక పాత్రకు జాన్వీని తీసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట. దాంతో ప్రస్తుతం డేట్స్ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని తాజా సమాచారం. సో.. ఆమె ఎంపిక ఖరారైతే కనుక ఆమె టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా జరగడంతో పాటు, ఎన్టీఆర్ చిత్రానికి కూడా మరింత క్రేజ్ వస్తుందని చెప్పచ్చు!