సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అడ్వాన్సు తిరస్కరించిన దీపిక 
  • చరణ్ కి కథ చెప్పిన వంశీ పైడిపల్లి
  • షూటింగ్ మొదలెడుతున్న మనోజ్
*  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి విదితమే. ఇందుకు గాను ఆమెకు అడ్వాన్సుగా ఓ భారీ మొత్తాన్ని నిర్మాత ఇవ్వగా, ఆమె తిరస్కరించిందని తెలుస్తోంది. ఎప్పుడైనా సరే షూటింగు ప్రారంభించాకనే తాను అడ్వాన్సు తీసుకుంటానని, ముందుగా ఎప్పుడూ తీసుకోనని ఆమె చెప్పిందట. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న 'రాధే శ్యామ్' పూర్తవగానే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
*  ఆమధ్య మహేశ్ బాబుతో 'మహర్షి' చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో చేసే అవకాశం కనిపిస్తోంది. వంశీ చెప్పిన కథ చరణ్ కు నచ్చడంతో ఓకే చెప్పాడట.
*  మంచు మనోజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'అహం బ్రహ్మాస్మి' చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ ఈ నెల రెండో వారం నుంచి జరుగుతుంది. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఈ షెడ్యూలును నిర్వహిస్తారు.


More Telugu News