తెలంగాణ నుంచి మంచి నీళ్ల ట్యాంకర్ నిండా మద్యం సరఫరా
- గుంటూరు జిల్లా మునుగోడు మండలంలో పట్టివేత
- ఎనిమిది మంది అరెస్టు
- 10వేల మద్యం సీసాలు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం తరలింపుపై తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ కొత్త పంథాలు ఎంచుకుంటున్నారు. గుంటూరు జిల్లా మునుగోడు మండలం అమరావతి వద్ద ఈ రోజు తనిఖీలు చేసిన పోలీసులకు భారీగా అక్రమ మద్యం పట్టుబడింది.
ఆ మద్యాన్ని తెలంగాణ నుంచి నీళ్ల ట్యాంకర్‌లో తరలించి తీసుకొచ్చిన సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తెలంగాణ నుంచి మద్యం వస్తోందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా పెట్టి ఆ ఎనిమిది మంది నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి దాదాపు 10వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.