ఎన్టీఆర్ కు స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో కొడాలి నానికి తెలియదా?: దివ్యవాణి
- చంద్రబాబును విమర్శించే స్థాయి కొడాలి నానికి లేదు
- నానిలాంటి ఎన్ని వ్యాఖ్యలు చేసినా చంద్రబాబుకు ఏమీ కాదు
- మంత్రి పదవిలో ఉండి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి మండిపడ్డారు. కొడాని నాని మాటతీరు, పనితీరుతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆమె అన్నారు. కొడాలి నానిని చూస్తే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అయినట్టు ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుది చంద్రమండల స్థాయి అని... ఆయనను విమర్శించే స్థాయి కొడాలి నానికి లేదని విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబును నాని విమర్శిస్తున్నారని... ఆరోజు జరిగిన పరిణామాలకు కొడాలి స్క్రిప్ట్ రాశాడా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో, సూట్ కేసులు ఎవరు తరలించారో నానికి తెలియదా? అని ప్రశ్నించారు.
ఖర్జూరనాయుడి ఫ్యాక్షనిజం వల్లో, రౌడీయిజం వల్లో చంద్రబాబు సీఎం కాలేదని దివ్యవాణి అన్నారు. నానిలాంటి వాళ్లు ఎన్ని వ్యాఖ్యలు చేసినా... చంద్రబాబు తెల్లవెంట్రుకల్లో ఒకటి కూడా కదలదని చెప్పారు. మంత్రి స్థాయిలో ఉండి లారీలతో గుద్దిస్తామని వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే ఎక్కడో పెట్టుకున్నట్టు... మంత్రి పదవి వస్తే ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదని చెప్పారు.