'ఆచార్య' విషయంలో ఆ విధంగా ప్లానింగ్!

  • చిరంజీవి, కాజల్ జంటగా రూపొందుతున్న 'ఆచార్య' 
  • లాక్ డౌన్ కి ముందే సగం పూర్తయిన షూటింగ్  
  • సింగిల్ షెడ్యూల్ లో ఏకబిగిన షూటింగ్ ప్లానింగ్
  • వచ్చే నెల నుంచి సెట్స్ కి వెళ్లే అవకాశం

గతంలో అప్పుడప్పుడు కార్మికుల సమ్మె కారణంగా కొన్నాళ్ల పాటు షూటింగులు ఆగేవి. సమస్య పరిష్కారం కాగానే ఒక్కసారిగా మళ్లీ మొదలైపోయేవి. అయితే, లాక్ డౌన్ కారణంగా ఐదు నెలల నుంచి ఆగిపోయిన షూటింగులు మాత్రం ఒక పట్టాన పట్టాలెక్కలేకపోతున్నాయి. ఎవరో ఒకరిద్దరు ధైర్యం చేసి మొదలెట్టినా.. కరోనా భయం వెంటాడుతుండడంతో అందరూ సెట్స్ కి వెళ్లలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న టాలీవుడ్ భారీ బడ్జెట్టు చిత్రాలలో ఒకటైన 'ఆచార్య' పరిస్థితి కూడా అలాగే వుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందే దాదాపు సగం పూర్తయింది. ఇక ఇప్పుడు అందరూ మెల్లమెల్లగా మొదలుపెడుతుండడంతో చిరంజీవి కూడా యూనిట్ ని సిద్ధంకమ్మని చెప్పారట.

దీంతో ఇప్పుడు షూటింగును పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడు ప్రారంభించినా ఇక మధ్యలో గ్యాప్స్ ఇవ్వకుండా ఏకబిగిన సింగిల్ షెడ్యూల్ లో కొట్టేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఆ ప్రకారం ఆయా సన్నివేశాల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలెట్టేయవచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.


More Telugu News