అమరావతి మహిళలు తన ఫొటోలకు చేసిన శవయాత్ర చూసిన తర్వాత కొడాలి నానికి డిప్రెషన్ ఎక్కువైంది: దివ్యవాణి

  • ప్రెసిడెంట్ మెడల్ మందు తాగి నోటికొచ్చినట్టు వాగుతున్నారు
  • ఎవరిని చూసినా ఆయనకు పందులు, కుక్కలే గుర్తుకొస్తున్నాయి 
  • వైయస్ పై రోజా ఎలాంటి కామెంట్లు చేశారో తెలియదా?
ఏపీ మంత్రి కొడాలి నానిపై తెలుగుదేశం నాయకురాలు దివ్యవాణి మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబు ముందు నాని ఒక బాతుబచ్చా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి మహిళలు తన ఫొటోలకు చేసిన శవయాత్ర చూసిన తర్వాత నానికి డిప్రెషన్ ఎక్కువైందని అన్నారు. ధర్మంగా, న్యాయంగా మాట్లాడేవారిని ఎవరిని చూసినా ఆయనకు పందులు, కుక్కలే గుర్తుకొస్తున్నాయని దుయ్యబట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డిపై గతంలో రోజా, విడదల రజని వంటి వారు ఎలాంటి విమర్శలు, కామెంట్లు చేశారో తెలియదా? అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న ప్రెసిడెంట్ మెడల్ మందు తాగి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మహిళలు చీపుళ్లతో కొట్టరా? అని దివ్యవాణి అన్నారు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగే ఆడవాళ్లతో తన ఫొటోలను దహనం చేయించారంటూ నాని చేసిన వ్యాఖ్యలు దారుణమని చెప్పారు.  జగన్ కోసం విజయమ్మ, షర్మిల రోడ్లమీదకు వచ్చారని... వారి గురించి టీడీపీ వాళ్లెప్పుడూ ఇంత అసహ్యంగా మాట్లాడలేదని అన్నారు.

జగన్ పాలనపై ప్రజలంతా విసిగిపోయారని... అయినా, దున్నపోతును ఎంత కొట్టినా పాలు ఇవ్వదు కదా అని సరిపెట్టుకుంటున్నారని దివ్యవాణి విమర్శించారు. రాజధాని రైతులకు, ప్రజలకు మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తోందని చెప్పారు.


More Telugu News