నా కండిషన్ కు జగన్ ఒప్పుకుంటే.. రాజీనామా చేస్తా: రఘురామకృష్ణరాజు
- నేను గెలిస్తే అమరావతిని కొనసాగిస్తామని జగన్ రాసివ్వాలి
- తన గెలుపును రెఫరెండంగా భావిస్తారా?
- జగన్ ను ఒప్పిస్తారా?
వైసీపీ నాయకత్వంపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రతిరోజు ఏదో ఒక తీవ్రమైన కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు ఆ పార్టీ ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రఘురాజు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ పై రఘురాజు స్పందిస్తూ... మన వైసీపీకి చెడ్డ పేరు రాకూడదనే అమరావతి రాజధానిగా ఉండాలని తాను చెపుతున్నానని అన్నారు.
తాను రాజీనామా చేసి గెలిస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని జగన్ రాసిస్తే... తాను రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పారు. ఈ కండిషన్ కు జగన్ ను మీరు ఒప్పిస్తారా? అని ప్రశ్నించారు. తన గెలుపుని అమరావతిపై రెఫరెండంగా స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? అని అడిగారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడిని నిరసిస్తూ ఈరోజు రఘురాజు ఒకరోజు దీక్షను చేపట్టారు. దీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.