ఈ చర్యలతో ఒకప్పటి బీహార్, యూపీని ఏపీ తలపిస్తోంది: దేవినేని ఉమ
- పైస్థాయిలోనే ధిక్కారం, లెక్కలేని స్వరం
- కిందిస్థాయిలో పతాక స్థాయికి దౌర్జన్యాలు
- ఉన్నతాధికారులనూ నిలబెట్టి బెదిరించడమే
- కప్పం కట్టకపోతే భూములు వెనక్కి, దళితులపై దాడులు
వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం తమ పార్టీ మద్దతుదారులపై దాడులు మొదలయ్యాయని, కొన్నిచోట్ల టీడీపీ సానుభూతిపరులు రోడ్డెక్కకుండా అడ్డంగా గోడలు కట్టేశారని ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ సర్కారుపై మండిపడ్డారు. గతంలో రాజకీయ విమర్శలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు మాత్రం ఆ స్థానంలో బూతులు ప్రవేశించాయని ఆ కథనంలో పేర్కొన్నారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు స్వయంగా ఈ అరాచకాలకు సహకరిస్తున్నారని అందులో పేర్కొన్న విషయాన్ని ఉమ ప్రస్తావించారు.
"పైస్థాయిలోనే ధిక్కారం, లెక్కలేని స్వరం, కిందిస్థాయిలో పతాక స్థాయికి దౌర్జన్యాలు, ఉన్నతాధికారులనూ నిలబెట్టి బెదిరించడమే. కప్పం కట్టకపోతే భూములు వెనక్కి, దళితులపై దాడులు. ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తున్న ఏపీ. ఎన్నడూలేని అరాచకానికి అడుగే దూరమంటున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు వైఎస్ జగన్?" అని దేవినేని ఉమ నిలదీశారు.