భవన కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు: నాదెండ్ల
- కరోనాతో కార్మికులకు ఉపాధి పోయిందన్న జనసేన నేత
- కుటుంబ పోషణే కష్టమైపోయిందని వెల్లడి
- కార్మికుల నిధిని పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు
- క్లెయిమ్స్ చెల్లించాలని డిమాండ్
ఇసుక అందుబాటులో లేకపోవడంతో పనులు తగ్గిపోయాయి అనుకుంటే ఇంతలోనే కరోనా రావడంతో ఉన్న కాస్త ఉపాధి కూడా పోయిందని, దాంతో భవన నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి నిర్మాణాలు నిలిచిపోయి, ఉపాధి లేక కుటుంబ పోషణ గడవడమే కష్టమైపోయిందని వివరించారు.
ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ఉందని తెలిపారు. చిన్నపాటి ఇంటి నిర్మాణం నుంచి భారీ నిర్మాణం వరకు ఏది ప్రారంభించినా నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి తప్పనిసరిగా సెస్ చెల్లిస్తారని, ఆ మొత్తం కార్మికుల కోసమే ఉపయోగించాల్సి ఉందని తెలిపారు. కానీ ఆ కార్మిక వర్గం సంక్షేమం కోసమే ఉన్న నిధి నుంచి రూ.450 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకుంటోందని ఆరోపించారు.
ఆ నిధిని పక్కదోవ పట్టించడం అంటే ఆ కష్టజీవులను మోసం చేయడమేనని తెలిపారు. చివరికి కేంద్రం నుంచి కార్మికుల కోసం వచ్చిన నిధులు కూడా దారిమళ్లించినట్టు తెలిసిందని, ఇకనైనా క్లయిమ్స్ ను తక్షణమే పరిష్కరించి ఆర్థిక లబ్దిని అందించాలని డిమాండ్ చేస్తున్నామని