అత్యాచారం జరిగితే జాతీయ అత్యయిక పరిస్థితే... లైబీరియా ప్రభుత్వం నిర్ణయం!
- దేశ రాజధాని మన్రోవియాలో విపరీతంగా పెరిగిన అత్యాచారాలు
- దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు
- అత్యాచారాల నిరోధానికి సరికొత్త చర్యలు ప్రకటించిన అధ్యక్షుడు
అత్యాచారాల విషయంలో పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అత్యాచారాలను జాతీయ అత్యయిక స్థితిగా పరిగణించనుంది. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు జార్జ్ వీ సంచలన ప్రకటన చేశారు. దేశ రాజధాని మన్రోవియాలో గత నెలలో వరుస అత్యాచారాలు దేశాన్ని కుదిపేశాయి. అత్యాచారాలను అరికట్టాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి.
దీంతో స్పందించిన అధ్యక్షుడు తాజా ప్రకటన చేశారు. అత్యాచారాలను దేశ అత్యవసర స్థితిగా ప్రకటించిన జార్జ్ వీ.. వాటిని అరికట్టేందుకు సరికొత్త చర్యలు ప్రకటించారు. అలాగే, ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు జాతీయ లైంగిక నేరస్తుల జాబితాను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, లైంగిక, లింగ ఆధారిత హింసపై జాతీయ భద్రతా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అధ్యక్షుడు జార్జ్ వీ ప్రకటించారు.