కరోనా నుంచి కోలుకున్నాక ఈ జాగ్రత్తలు తప్పనిసరి: కేంద్ర ప్రభుత్వం

  • ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు ఉంటాయి
  • వ్యాయామం చేయాలి
  • నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి
  • రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకోవాలి
దేశంలో కరోనా వైరస్ అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. కరోనా బాధితుల విషయంలో తాజాగా కేంద్ర సర్కారు మరికొన్ని సూచనలు చేసింది.  కొవిడ్-19‌ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పింది. ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, నీరసంగా ఉండడం వంటివి వారిలో కనపడతాయని తెలిపింది.

అయితే, ఈ విషయం లో బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనా వైరస్ నుంచి కోలుకోవడానికి సమయం ఎక్కువ పట్టే అవకాశముందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం కూడా వ్యాయామం చేయాలని, అటువంటి వారు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు షోషకాహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని సూచనలు చేసింది.

అలాగే, బాధితులు గుండె పని తీరుతో పాటు రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకోవాలని తెలిపింది. కరోనా వచ్చిన సమయంలో, రాకముందు మాస్క్‌ ధరించినట్లే అనంతరం కూడా ఆ పని చేయాలని, శానిటైజర్‌ వాడాలని, సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పింది. అలాగే, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తీవ్రతరమైతే ఆలస్యం చేయొద్దని, వైద్యులను సంప్రదించాలని తెలిపింది.


More Telugu News