మరో రెండు రోజులు వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ!
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
- పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని జల్లులు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్, విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రాల అధికారులు అంచనా వేశారు. అల్పపీడనం బలపడుతోందని, ఇదే సమయంలో ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉండటం కూడా వర్షాలకు కారణమైందని స్పష్టం చేశారు.
కాగా, గత రాత్రి 11 గంటల నుంచి తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా చిరు జల్లులు కురుస్తున్నాయి. ఏపీలోని నెల్లూరు, కడప, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.