అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై మాజీ మోడల్ సంచలన ఆరోపణలు!
- యూఎస్ ఓపెన్ టెన్నిస్ సందర్భంగా తనపై అనుచితంగా ప్రవర్తించారు
- కుటుంబ భద్రత కోసమే ఇన్నాళ్లూ ఈ విషయాన్ని బయటపెట్టలేదు
- అప్పుడు నా వయసు 21, ట్రంప్ వయసు 51 ఏళ్లు ఉండొచ్చు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని మాజీ మోడల్ అమీ డోరిస్ (48) చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరోమారు అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్న ట్రంప్‌పై డోరిస్ చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. అమెరికన్ కాలమిస్ట్ ఇ.జీన్ కారోల్ ఇప్పటికే ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా డోరిస్ చేసిన ఆరోపణలు మరింత వేడిని రాజేశాయి.
న్యూయార్క్‌లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా 1997లో వీఐపీ సూట్‌లో ట్రంప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని డోరిస్ ఆరోపించినట్టు ‘ది గార్డియన్’ పేర్కొంది. తనతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు తనను గట్టిగా లాగి ముద్దు పెట్టుకున్నారని, తన శరీరాన్ని అనుచితంగా తాకారని డోరిస్ పేర్కొన్నారు. అప్పుడు తన వయసు 21 ఏళ్లు కాగా, ట్రంప్ వయసు 51 ఏళ్లు ఉండొచ్చన్నారు.
ఈ విషయాన్ని వెల్లడించాలని 2016లోనే తాను భావించానని, అయితే, కుటుంబ భద్రత, పిల్లల కోసం ఇన్నాళ్లు మౌనంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తన టీనేజీ కవల కుమార్తెలకు రోల్ మోడల్‌గా నిలవాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడీ విషయాన్ని బయటపెట్టినట్టు డోరిస్ పేర్కొన్నారు. ఆమె ఆరోపణలపై ట్రంప్ న్యాయవాదులు స్పందించారు. డోరిస్ ఆరోపణల్లో వాస్తవం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే వీటిని చేస్తున్నారని కొట్టిపడేశారు.