రజనీకాంత్ నేతృత్వంలో తమిళనాడులో ఆధ్యాత్మిక పాలన: అర్జున్ సంపత్
- ద్రవిడ పార్టీలకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది
- బీజేపీ సారథ్యంలోని కూటమి ఘన విజయం సాధిస్తుంది
- అక్టోబరు 2న ఆధ్యాత్మిక మహానాడు
తమిళ సూపర్ రజనీకాంత్ కనుక అధికారంలో వస్తే తమిళనాడులో ఆధ్యాత్మిక పాలన వెల్లివిరుస్తుందని హిందూ మక్కల్ కట్చి చీఫ్ అర్జున్ సంపత్ అన్నారు. రజనీ నేతృత్వంలో ఆధ్యాత్మిక పాలనను తీసుకొచ్చేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు.
ద్రవిడ పార్టీలకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని, బీజేపీ సారథ్యంలోని కూటమి రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధిస్తుందని అర్జున్ సంపత్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజున ఈరోడ్ జిల్లా చెన్నిమలైలో హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక మహానాడు నిర్వహించనున్నట్టు తెలిపారు. కందషష్టి కవచం పారాయణం చేసి కావళ్ల ఊరేగింపును విజయవంతం చేయడం తదితర అంశాలపై ఈ మహానాడులో నిర్ణయాలు తీసుకోనున్నట్టు అర్జున్ తెలిపారు.