ఈ చెట్టులో తేలు విషాన్ని పోలిన గరళం!
- ఆస్ట్రేలియాలోని ఓ చెట్టుకు విషపు ముళ్లు
- గుచ్చుకుంటే వారాల తరబడి నొప్పులు
- క్వీన్స్ లాండ్ వర్సిటీ పరిశోధనలో వెల్లడి
ఈ ప్రపంచంలోని విశాలమైన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఇక్కడ జీవ వైవిధ్యం కూడా ఎక్కువే. విషపూరితమైన సాలీళ్లు, సర్పాలు, సముద్ర జలచరాలకు ఆస్ట్రేలియా ఎంతో ప్రసిద్ధి చెందింది. తాజాగా క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆస్ట్రేలియాలో ఓ చెట్టును అత్యంత విషపూరితమైనదిగా గుర్తించారు. దీని విషం తేలు విషాన్ని పోలి ఉన్నట్టు తెలుసుకున్నారు. ఈ చెట్టు విష ప్రభావానికి గురైతే తీవ్రమైన నొప్పులతో వారాల తరబడి బాధపడతారట.
దీన్ని స్థానికంగా జింపీ జింపీ అని పిలుస్తారు. ఈ చెట్టు ఆకులను పొరబాటున తాకితే వాటికున్న ముళ్ల వంటి నిర్మాణాలు శరీరంలోకి విషాన్ని పంపుతాయి. ఆస్ట్రేలియాలో ఈ చెట్లు ఈశాన్య క్వీన్స్ లాండ్ లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్టు ముల్లు గుచ్చుకోగానే మొదట విపరీతమైన మంట కలుగుతుందట.
ఓ కారు డోర్ లో ఏదైనా అవయవం ఇరుక్కుని నలిగిపోతే ఎంత బాధ కలుగుతుందో దీని విషం కూడా అంతే బాధ కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నొప్పి నుంచి ఉపశమనం కలిగించే చికిత్సలను మరింత మెరుగుపరిచేందుకు ఇలాంటి పరిశోధనలు ఉపయుక్తంగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.