సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • రవితేజ సినిమాలో కేథరిన్  
  • ఓటీటీకి వెళ్లిపోతున్న 'గమనం'
  • 'సూపర్ మచ్చి' పాట చిత్రీకరణ  
*  ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న రవితేజ తన తదుపరి చిత్రాన్ని రమేశ్ వర్మ దర్శకత్వంలో చేయనున్నాడు. రవితేజ డబుల్ రోల్స్ పోషించే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తారు. ఇక ఇందులో స్పెషల్ సాంగులో కథానాయిక కేథరిన్ నటిస్తుందని తాజా సమాచారం.
*  శ్రియ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన 'గమనం' చిత్రం షూటింగును పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. సుజనారావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారట.      
*  చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న 'సూపర్ మచ్చి' చిత్రం కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, కల్యాణ్ దేవ్ తదితరులు ఈ పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇది పూర్తయితే మరొక్క పాట చిత్రీకరణ మాత్రం మిగిలివుంటుంది. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.  


More Telugu News