సర్కారువారి ఇన్‌సైడర్ ట్రేడింగ్ డ్రామాలో ఉపసంఘం తేల్చిందేమిటి?: దేవినేని ఉమ

  • సీఆర్‌డీఏ ఉనికిలోకి రాకముందు లావాదేవీలు అవి 
  • ప్రభుత్వపెద్దలు చెప్పినట్లు నివేదిక
  • అమరావతి రాజధాని రైతుల ఆగ్రహం
'ఇన్‌సైడర్' పేరిట అమరావతి భూములపై వైసీపీ సర్కారు రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. సీఆర్‌డీఏ ఉనికిలోకి రాకముందు జరిగిన
లావాదేవీలన్నీ 'ఇన్‌సైడర్' ఖాతాలోనే లెక్కకడుతున్నారని ఆయన చెప్పారు. సుదూరంగా భూములు కొన్నా అక్రమమేనంటూ వైసీపీ సర్కారు చెబుతోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఓ వీడియో రూపంలో ఆయన తెలిపారు. అమరావతి భూముల విషయంలో ప్రభుత్వపెద్దలు చెప్పినట్లు మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

'సీఆర్‌డీఏ ఉనికిలోకి రాకముందు లావాదేవీలు ఇన్సైడర్ ఖాతాలోకే.. సుదూరంగా భూములుకొన్నా అక్రమమేనంట.. ప్రభుత్వపెద్దలు చెప్పినట్లు నివేదిక.. రాజధాని రైతుల ఆగ్రహం.. విశాఖ చుట్టూ వైసీపీ కొనుగోళ్లను ఏమంటారు? సర్కారువారి ఇన్సైడర్ ట్రేడింగ్ డ్రామాలో ఉపసంఘం శోధించి తేల్చిందేమిటో ప్రజలకు చెప్పండి వైఎస్‌ జగన్‌ గారూ' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.  


More Telugu News