బాత్రూములో జారిపడి.. ఆస్ట్రేలియాలో వికారాబాద్ జిల్లా యువకుడి మృతి

  • ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు
  • మెదడులో నరాలు చిట్లిపోవడంతో బ్రెయిన్ డెడ్
  • మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్‌కు అభ్యర్థన
ఆస్ట్రేలియాలో బాత్రూములో జారిపడి బ్రెయిన్ డెడ్ అయిన వికారాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. జిల్లాలోని ధారూర్ మండలం హరిదాస్‌పల్లికి చెందిన హరి శివశంకర్‌రెడ్డి (25) హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేసిన అనంతరం ఉన్నత చదువుల కోసం 2018లో ఆస్ట్రేలియా వెళ్లాడు. సౌత్రన్ క్రాస్ యూనివర్సిటీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 15న స్నానాల గదిలోకి వెళ్లిన శివశంకర్‌రెడ్డి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.

స్నేహితులు వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో నరాలు చిట్లిపోయినట్టు చెప్పారు. ఐదు రోజుల క్రితం బ్రెయిన్‌డెడ్ అయిన శివశంకర్‌రెడ్డి పరిస్థితి విషమించడంతో నిన్న మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహకరించాలంటూ ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.


More Telugu News