కరోనా చైనా ల్యాబ్‌లోనే పుట్టింది.. వ్యాప్తిని చైనా దాచింది: చైనా వైరాలజిస్ట్ లి మెంగ్‌

  • కొవిడ్‌-19 వ్యాప్తి గురించి చైనా సర్కారుకు ముందే తెలుసు
  • ఈ సమాచారాన్ని కప్పిపుచ్చడానికి డబ్ల్యూహెచ్‌ఓ ప్రయత్నాలు
  • చైనాపై నింద పడకుండా చేయాలనుకుంది
  • నా కుటుంబాన్ని చైనా సర్కారు భయపెడుతోంది
కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో చైనాపై ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న వేళ అది వూహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందంటూ ఇటీవల వెల్లడించి సంచలనం సృష్టించిన చైనా వైరాలజిస్ట్‌ లి మెంగ్‌ యాన్‌ మరోసారి ఆ వైరస్‌పై కీలక విషయాలు చెప్పింది. కొవిడ్‌-19 వ్యాప్తి గురించి చైనా సర్కారుకు ముందే తెలుసని ఆమె పేర్కొంది.

అంతేగాక, ఈ సమాచారాన్ని కప్పిపుచ్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పింది. చైనాపై నిందపడకుండా చేయాలనుకుందని ఆమె ఆరోపించింది. తాను చెబుతోన్న ఈ విషయాలను నిరూపించడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పింది. తాను ఈ విషయాలను చెబుతుండడంతో  చైనా సర్కారు తనను సోషల్‌ మీడియా ద్వారా బెదిరించాలని చూస్తోందని ఆమె తెలిపింది. అలాగే, తన కుటుంబాన్ని కూడా భయపెడుతోందని చెప్పింది.

కరోనా వైరస్‌ ఫుడ్‌ మార్కెట్‌ నుంచి రాలేదని, ల్యాబ్‌ నుంచే వచ్చిందని ఆమె మరోసారి స్పష్టం చేసింది. ఈ వైరస్‌ను చైనా ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేసిందో, ఎందుకు బయటకు వచ్చేలా చేసిందో తాను ప్రజలకు తెలపాలనుకుంటున్నానని చెప్పింది. వూహాన్‌లో వైరస్‌ గురించి చేస్తోన్న పరిశోధనల్లో భాగంగా తనకు కొత్త విషయాలు తెలిశాయని తెలిపింది.


More Telugu News