షెడ్యూలు కంటే 8 రోజుల ముందే ముగిసిన పార్లమెంటు సమావేశాలు
- ఈ నెల 14న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు
- నిరవధికంగా వాయిదా పడిన ఉభయ సభలు
- నేడు మూడు బిల్లులకు ఆమోదం
ఈ నెల 14న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. అక్టోబరు 1వ తేదీ వరకు జరగాల్సిన సమావేశాలు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో షెడ్యూలు కంటే ఎనిమిది రోజుల ముందే ముగిశాయి. కొవిడ్ కారణంగా సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించగా, లోక్‌సభ సమావేశాలను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.
మొత్తం పది రోజులపాటు సమావేశాలు జరగ్గా ప్రభుత్వం కొత్తగా 16 బిల్లులను ప్రవేశపెట్టింది. మొత్తం 10 సిట్టింగులలో 25 బిల్లులను ఆమోదించింది. కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులు నేడు ఆమోదం పొందాయి. పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రతకు సంబంధించిన బిల్లులివి. కాగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పూరి సహా ఈ అక్టోబరులో పదవీ విరమణ చేయనున్న వారికి రాజ్యసభ వీడ్కోలు పలికింది.