ప్రశ్నిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలతో బూతులు తిట్టిస్తారా?: దేవినేని ఉమ
- తిరుమల ఆచారాలను ఎందుకు పాటించరు?
- ఇతర మతాల ఆచారాలను గౌరవించరా?
- కలెక్షన్ల మంత్రులతో మంత్రివర్గం కళకళలాడుతుంది
- దేవాలయాలపై దాడులను ప్రశ్నిస్తే తప్పేంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిక్లరేషన్‌పై వస్తోన్న విమర్శలను ఎదుర్కోలేక మంత్రులు, ఎమ్మెల్యేలతో బూతులు తిట్టిస్తారా? అంటూ జగన్‌ను టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు.
'తిరుమల ఆచారాలను ఎందుకు పాటించరు? ఇతర మతాల ఆచారాలను గౌరవించరా? కలెక్షన్ల మంత్రులతో మంత్రివర్గం కళకళలాడుతుంది, దేవాలయాలపై దాడులను ప్రశ్నిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలతో బూతులు తిట్టిస్తారా? ప్రజల హక్కులను అణచి వేస్తారా? భక్తుల మనోభావాలు దెబ్బతీసిన మీ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు వైఎస్ జగన్ గారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓ దిన పత్రికలో ఇందుకు సంబంధించిన వచ్చిన కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.