ఎస్పీ బాలుకు కన్నీటి వీడ్కోలు పలికిన హీరో విజయ్

  • అధికార లాంఛనాలలతో బాలు అంత్యక్రియలు
  • బాలు పార్థివదేహాన్ని చూసి చలించిపోయిన విజయ్
  • ఎస్పీ చరణ్ ను ఓదార్చిన హీరో
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు చెన్నై సమీపంలో ఉన్న ఆయన వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య జరుగుతున్నాయి. ఫాంహౌస్ లో ఉన్న ఆయన పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.

చివరి క్షణంలో తమిళ స్టార్ హీరో విజయ్ అక్కడకు వచ్చారు. బాలు భౌతికకాయాన్ని చూసి చలించిపోయారు. ఆయన పార్థివదేహానికి నమస్కరించి అంజలి ఘటించారు. పక్కనే ఉన్న బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ని సముదాయించారు. మరోవైపు ఫాంహౌస్ వద్దకు అభిమానులు పోటెత్తుతున్నప్పటికీ... కరోనా నేపథ్యంలో ఫాంహౌస్ లోకి అందరినీ పోలీసులు అనుమతించడం లేదు.


More Telugu News