దళితులపై ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదు: మాజీ ఎంపీ హర్షకుమార్

  • విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం
  • దళితులపై దాడుల కేసుల్లో న్యాయం జరగడంలేదని ఆవేదన
  • కాపులపైనా, ముస్లింలపైనా కేసులు ఎత్తేశారని వెల్లడి
ఏపీలో దళితులపై జరుగుతున్న దాడులు, ఇతర అంశాలపై చర్చించేందుకు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా హాజరయ్యారు. దళితులపై దాడుల కేసుల్లో న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాల యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసు విచారణ సందర్భంగా తప్పని సరి పరిస్థితుల్లో తానే పిల్ వేయాల్సి వచ్చిందని వివరించారు. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు జైల్లో వేశారని ఆరోపించారు.

రైలు దహనం ఘటనలో కాపులపై కేసులు ఎత్తివేశారని, రిలయన్స్ మాల్స్ పై దాడుల కేసులు, ముస్లిం యువతపై పెట్టిన కేసులు ఎత్తివేశారని తెలిపారు. కానీ దళితులపై ఉన్న ఒక్క కేసును కూడా ఎత్తివేయలేదని ఆరోపించారు. దళితులపై ఉన్న కేసుల జాబితాను సీఎంకు పంపామని ఆయన వివరించారు.


More Telugu News