చంద్రబాబు ఇంటిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు: సజ్జలకు వర్ల రామయ్య కౌంటర్

  • ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సలహాలివ్వండి  
  • దళితుల మీద దాడులు ఆపాలని సలహా ఇవ్వండి
  • మీ నాయకుల భూ కబ్జాలు ఆపాలని సలహా ఇవ్వండి
  • జీతం తీసుకుంటున్నందుకు మీకు తృప్తిగా వుంటుంది
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు. కృష్ణానదికి వరద వస్తోందని, ఇకనైనా చంద్రబాబు చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయాలని సజ్జల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కోర్టుల ద్వారా రక్షణ పొందినా, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా, పైనుంచి వచ్చిన వరద మీ ఇంటిని ముంచివేయక మానదుకదా? అని ఆయన అన్నారు. దీనిపై వర్ల రామయ్య స్పందించారు.  

'సజ్జల గారూ.. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న చంద్రబాబు ఇంటిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీరు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సలహాలివ్వండి  చాలు. దళితుల మీద దాడులు ఆపాలని సలహా ఇవ్వండి. మీ నాయకుల భూ కబ్జాలు ఆపాలని సలహా ఇవ్వండి. జీతం తీసుకుంటున్నందుకు, మీకు  తృప్తిగా వుంటుంది' అని వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు.


More Telugu News