లాయర్ తర్వాత లెక్చరర్ పాత్రలో పవన్ కల్యాణ్?

  • 'వకీల్ సాబ్'లో లాయర్ పాత్రలో పవన్ 
  • హరీశ్ శంకర్ సినిమాలో లెక్చరర్ పాత్ర
  • ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు   
పవన్ కల్యాణ్ అభిమానులెవరూ 'గబ్బర్ సింగ్' సినిమాను మర్చిపోలేరు. యాక్షన్ కి యాక్షన్.. ఎంటర్ టైన్మెంట్ కి ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా వున్న సినిమా అది. అందుకే, అంతటి స్థాయిలో హిట్టయింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో అంటే హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా మరో చిత్రం రూపొందుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. ఇక ఇందులో పవన్ ఎటువంటి పాత్ర పోషిస్తారనేది అభిమానులకు ఆసక్తిని కలిగించే అంశం. ఈ సినిమాలో ఆయన కాలేజీ లెక్చరర్ పాత్రను పోషిస్తారన్నది తాజా సమాచారం. ఈ పాత్ర చాలా గమ్మత్తుగా సాగుతుందని అంటున్నారు.

మరోపక్క, ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'వకీల్ సాబ్' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ షూటింగులో పవన్ త్వరలో పాల్గొంటారు. హిందీలో హిట్టయిన 'పింక్' చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఇక దీని తర్వాత పవన్ క్రిష్ సినిమా, ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమా చేస్తారని అంటున్నారు.  


More Telugu News