కృష్ణమ్మ వరదలో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాతయ్య ఇల్లు!
- అవనిగడ్డ సమీపంలో నది ఒడ్డున ఇల్లు
- తాజా వరదల్లో నీటిలో మునక
- ఆవేదనతో తిలకించిన గ్రామస్థులు
భారత అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా పేరు తెచ్చుకున్న డాక్టర్ మైనేని హరిప్రసాద్ కు చెందిన ఇల్లు కృష్ణానది వరద నీటిలో కొట్టుకుపోయింది. ప్రముఖ సినీ హీరో శర్వానంద్ కు ఆయన తాతయ్య అవుతారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో అవనిగడ్డ సమీపంలోని ఎడ్లలంక గ్రామంలో నది ఒడ్డున ఈ ఇల్లు ఉంది.
గతంలో ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా శర్వానంద్ ఇక్కడే ఉండేవాడు. ఈ భవనం కృష్ణా నది వరద నీటిలో కొట్టుకుపోతుంటే, స్థానికులు పెద్దఎత్తున గుమికూడి ఆవేదనతో చూస్తుండిపోయారు. గత సంవత్సరం వచ్చిన వరదల్లో శర్వానంద్ ముత్తాత, హరిప్రసాద్ తండ్రి నివసించిన ఇల్లు నదిలో కొట్టుకుపోగా, ఈ సంవత్సరం తాతయ్య ఇల్లు కొట్టుకుపోయింది. వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో, పాతకాలం ఇల్లయిన ఈ పెంకుటిల్లు పునాదులు కదిలిపోయి, నదిలో కలిసిపోయింది.