కరోనా నుంచి కోలుకున్నాక కూడా దుష్ప్రభావాలు
- గుర్తించిన దక్షిణ కొరియా పరిశోధకులు
- 965 మందిపై సర్వే
- 879 మందిలో దుష్ప్రభావాలు
- 26.2 శాతం మందిలో అలసట, ఏకాగ్రత లోపం
ప్రపంచ మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి రోజురోజుకీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. శరీరంలో వైరస్ ఉన్నప్పుడే కాకుండా అది వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రమాదం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే, వారిలో కొంతమందిపై దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని దక్షిణ కొరియా పరిశోధకులు తెలిపారు.
ఆ దేశంలో నిర్వహించిన ఒక ప్రాథమిక అధ్యయనాన్ని అనుసరించి ఈ పరిశోధన ఫలితాలు వెల్లడించారు. కోలుకున్న కరోనా బాధితుల్లో చాలా మందికి అలసట, మానసిక ఆందోళన, వాసన, రుచి కోల్పోవడం లాంటి దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని చెప్పారు.
కరోనా నుంచి కోలుకున్న 965 మందిని ఆన్‌లైన్ సర్వేలో ప్రశ్నించామని, వారిలో 879 మంది దుష్ప్రభావాలు ఎదుర్కొంటున్నామని తెలిపారని పరిశోధకులు చెప్పారు. కోలుకున్న 26.2 శాతం మందిలో అలసట, ఏకాగ్రత లోపించిన లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కొంతమందిలో మానసిక ఆందోళన, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ అంశాలపై పరిశోధకులు మరిన్ని వివరాలు సేకరించనున్నారు.