'ఫీలింగ్ గ్రేట్' అంటూ తాజా ప్రకటన చేసిన ట్రంప్!
- కొనసాగుతోన్న అమెరికా ఎన్నికల ప్రక్రియ
- డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్‌తో ట్రంప్ వచ్చేవారం డిబేట్
- ఇటీవల కరోనా బారినపడ్డ ట్రంప్
- డిబేట్లో పాల్గొంటానని ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో ఆయన కరోనా బారిన పడడంతో అధ్యక్షుడి తదుపరి కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది. ఆయన పలు డిబేట్లు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా, అవన్నీ వాయిదా పడతాయని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పటికే ఆసుపత్రి నుంచి వైట్‌హౌస్ కు చేరుకున్న ట్రంప్ ఈ రోజు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్‌తో తాను వచ్చేవారం పాల్గొనాల్సిన డిబేట్ పై స్పష్టతనిస్తూ ట్వీట్లు చేశారు. 'ఫీలింగ్ గ్రేట్' అంటూ ఓ ట్వీట్ చేశారు. తర్వాత కాసేపటికే మరో ట్వీట్ చేస్తూ... 'అక్టోబరు 15న, గురువారం సాయంత్రం మియామీలో జరిగే డిబేట్లో నేను పాల్గొంటాను. అది చాలా అద్భుతంగా ఉంటుంది' అంటూ ట్రంప్ తెలిపారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల మధ్య డిబేట్లు నిర్వహిస్తారు.