సింగరేణి కార్మికులకు కనిపించిన అరుదైన మూషిక జింకపిల్ల.. అటవీశాఖ అధికారులకు అందజేత

  • కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో లభ్యం
  • అంతరించిపోతున్న జాతుల్లో ఇది కూడా ఒకటి
  • కిన్నెరసాని అభయారణ్యానికి తరలింపు
ఖమ్మం జిల్లాలో అరుదైన మూషిక జింక పిల్ల కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని వయసు మూడు నెలలు ఉంటుందని అధికారులు తెలిపారు. సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతమైన కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు ఇది దొరికింది. వెంటనే దీనిని అటవీశాఖ అధికారులకు అందజేశారు.

వారు దానిని పాల్వంచ కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యానికి తరలించారు. అంతరించిపోతున్న జాతుల్లో మూషిక జింక కూడా ఒకటని, ఇది ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తుందని అధికారులు తెలిపారు. అలాంటిది ఈ అటవీ ప్రాంతంలో ఇది కనిపించడం అరుదైన విషయమేనని అన్నారు.


More Telugu News