సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన నయనతార
- క్రిష్ సినిమాలో కీలక పాత్రకు రానా?
- రామోజీ ఫిలిం సిటీకి వస్తున్న శింబు
* అటు స్టార్ హీరోలతో నటిస్తూనే అప్పుడప్పుడు కథానాయిక ప్రధాన చిత్రాలలో కూడా నటించే నయనతార తాజాగా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి ఓకే చెప్పింది. షార్ట్ ఫిలిం మేకర్ నవకాంత్ రాజకుమార్ చెప్పిన కథ విని, నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
* వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రం రూపొందుతోంది. వికారాబాద్ అడవుల్లో ఈ చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా జరుగుతోంది. కాగా, ఇందులో ఓ కీలక పాత్ర కోసం రానా దగ్గుబాటిని దర్శకుడు సంప్రదిస్తున్నట్టు సమాచారం.
* తమిళ నటుడు శింబు త్వరలో రామోజీ ఫిలిం సిటీకి రానున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందుతున్న 'మానాడు' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. మళ్లీ త్వరలో అక్కడే ఈ చిత్రం షూటింగును కొనసాగించనున్నారు.