'వెయిట్ లాస్ కోసం బిగ్ బాస్ కి వెళ్లండి' అంటూ సలహా ఇచ్చిన గీతా మాధురి!

  • బిగ్‌బాస్ షోపై గీతామాధురి సెటైర్‌
  • సన్నగా అయిపోయిన ఫొటో పోస్ట్
  • అప్పట్లో హౌస్‌‌ నుంచి బయటకొచ్చాక ఫొటో తీసుకున్న గీత
తెలుగు బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న‌ బిగ్‌బాస్ నాలుగో సీజన్ పై సామాజిక మాధ్యమాల్లో ఎప్ప‌టిలాగే నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు, విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నెటిజ‌న్లే కాకుండా గ‌తంలో తెలుగు బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారు కూడా ఈ షోపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గత ఏడాది బిగ్ బాస్ షోలో సినీనటుడు వరుణ్ సందేశ్, ఆయన భార్య వితిక కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో సామాజిక మాధ్యమాల్లో తన గురించి వచ్చిన విమర్శల పట్ల తాను చాలా బాధపడ్డానని ఇటీవలే వితిక తెలిపింది. బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొన్న ఆమె ఇటీవల తన అనుభవాలను చెబుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో తాజాగా, బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్న గాయని గీతా మాధురి ఆ షోపై సెటైర్లు వేస్తూ వ్యాఖ్యానించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ... రెండేళ్ల‌ క్రితం దిగిన‌ ఫొటో ఇది అని తెలిపింది. బరువు తగ్గించుకుని సన్నగా అవ్వాలనుకుంటే బిగ్‌బాస్‌కు వెళ్లమని మీకు సలహా ఇస్తాన‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఆ ఫొటోలో ఆమె స‌న్నగా క‌న‌ప‌డుతోంది.

     


More Telugu News