కొత్త షోను ప్రకటించిన మంచు లక్ష్మి.. ప్రోమో ఇదిగో!

  • వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా రాణిస్తున్న మంచు లక్ష్మి
  • ఇప్పటికే పలు షోలతో రాణించిన లక్ష్మి
  • తాజాగా 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మి మంచు' పేరుతో కొత్త షో ప్రకటన
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె అయినా... ఆయన ప్రభావం తన మీద పడకుండా, స్వశక్తితో ఎదిగి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని మంచు లక్ష్మి సంపాదించుకుంది. సినిమాలలో రాణిస్తూనే, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసింది.

 'ఫీట్ అప్ విత్ స్టార్స్', 'లాక్డ్ అప్ విత్ లక్ష్మి మంచు' తదితర షోలు జనాలను ఆకట్టుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో పలువురు సెలబ్రిటీలతో లక్ష్మి నిర్వహించిన 'లాక్డ్ అప్ విత్ లక్ష్మి మంచు' కార్యక్రమం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. ఈరోజు ఆమె పుట్టినరోజు. తన జన్మదినం సందర్భంగా సరికొత్త షోను లక్ష్మి ప్రకటించింది.

'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మి మంచు' పేరుతో ఈ షో రాబోతున్నట్టు ఆమె ప్రకటించారు. గత షోల మాదిరే సినీ స్టార్లు, స్పోర్ట్ స్టార్లు, ఫ్యాషన్, ఫుడ్ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ షోలో ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ షోను 'సౌత్ బే' సమర్పిస్తోంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోలో రాజమౌళి, సానియా మీర్జా, సెంథిల్ రామమూర్తి, తాప్సీ, ప్రకాశ్ అమృతరాజ్, నిఖిల్, శంతను, పూజా ధింగ్రా తదితర సెలబ్రిటీలు కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ షో డిజిటల్ ప్లేట్ ఫామ్ పై ప్రారంభంకానుంది.


More Telugu News