జగన్ రాసిన లేఖపై ఎవరూ మాట్లాడొద్దు: వైసీపీ నేతలకు వాట్సాప్ ద్వారా ఆదేశాలు
- జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ సీజేఐకు జగన్ లేఖ
- జగన్ కు వ్యతిరేకంగా దాఖలవుతున్న పిటిషన్లు
- మౌనంగా ఉండాలంటూ నేతలకు సజ్జల ఆదేశాలు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఏపీ హైకోర్టు జడ్జిలను సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారంటూ లేఖలో జగన్ ఆరోపించారు. దీనికి తోడు పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీజేఐకు జగన్ రాసిన లేఖపై పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ మాట్లాడవద్దని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అందరికీ వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించారు. ఈ అంశంపై ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, బహిరంగంగా మాట్లాడటం కానీ, పత్రికా ప్రకటనలు విడుదల చేయడం కానీ చేయవద్దని ఆదేశించారు.