విజయ్ సేతుపతి సినిమాలో నిత్యామీనన్

  • మలయాళంలో విజయ్ తొలి సినిమాగా 'మార్కొని మత్తయ్య' 
  • తాజాగా ఇందు దర్శకత్వంలో మరో మలయాళ సినిమా
  • కథానాయికగా నిత్యా మీనన్.. త్వరలో షూటింగ్  
మొదటి నుంచీ కథానాయిక నిత్యా మీనన్ అంతే.. దూకుడుగా సినిమాలు చేసింది ఎప్పుడూ లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకున్నదీ లేదు. కథ నచ్చాలి.. తన పాత్ర నచ్చాలి.. ఇలా చాలా షరతులు పెడుతుందని మన సినీ పరిశ్రమలో అంటుంటారు. అందుకు తగ్గట్టుగానే తన కెరీర్లో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పచ్చు. 

ఈ క్రమంలో ఈ మలయాళ ముద్దుగుమ్మ తాజాగా ఓ చిత్రాన్ని అంగీకరించింది. విజయ్ సేతుపతి సరసన కథానాయికగా ఈ చిన్నది నటించనుంది. విజయ్ మలయాళంలో ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. ఇందు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో నిత్యామీనన్ ని కథానాయికగా ఎంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ మొదలవుతుంది. ఆమధ్య మలయాళంలో విజయ్ సేతుపతి తొలిసారిగా 'మార్కొని మత్తయ్య' అనే చిత్రాన్ని చేశాడు.

ఇదిలావుంచితే, ప్రస్తుతం ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథతో తెరకెక్కుతున్న '800' సినిమాలో మురళీధరన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా ఇంకా సెట్స్ కి వెళ్లకుండానే తమిళనాట వివాదాన్ని కొనితెచ్చుకుంది.



More Telugu News