బీహార్ ఎన్నికలు.. హిజ్రాను బరిలోకి దింపిన ఎల్‌జేపీ
- వేడెక్కుతున్న బీహార్ రాజకీయం
- హథువా నుంచి మున్నా అనే హిజ్రాకు టికెట్
- ప్రస్తుతం హథువా కౌన్సిలర్‌గా ఉన్న మున్నా
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో బీహార్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీలన్నీ ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఇటీవల 95 మందితో కూడిన జాబితాను ప్రకటించిన లోక్‌జనశక్తి (ఎల్‌జేపీ) నిన్న రెండో దశ కోసం 53 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో ఓ హిజ్రా కూడా ఉండడం విశేషం. హథువా నియోజకవర్గం నుంచి రాం ప్రసాద్ అలియాస్ మున్నా అనే హిజ్రాను బరిలోకి దింపింది. దీంతో ఇతర పార్టీలు కూడా హిజ్రాలకు టికెట్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం రెండో దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, మున్నా తన నామినేషన్ దాఖలు చేశారు. గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన మున్నా గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ప్రస్తుతం హథువా కౌన్సిలర్‌గా ఉన్నారు. గతంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2012లో ఫులవరియా, 2015లో హథువా ఎన్నికల్లో విజయం సాధించారు.