లో-కట్ బ్లేజర్ వేసుకున్న ఫిన్లాండ్ ప్రధానిపై తీవ్ర విమర్శలు
- చిన్న వయసులోనే ఫిన్లాండ్ ప్రధాని అయిన మారిన్
- లో-కట్ బ్లేజర్ తో మేగజీన్ కు ఫొటో షూట్
- ప్రధాని పదవిలో ఉండి ఇలాంటి దుస్తులు ధరిస్తారా? అంటూ విమర్శలు
ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఇటీవల ఆమె వేసుకున్న డ్రెస్సే. లో-కట్ బ్లేజర్ వేసుకుని 'ట్రెండీ' మేగజీన్ కోసం 34 ఏళ్ల ఆమె ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఆమె ఫొటోను సదరు మేగజీన్ కవర్ ఫొటోగా వేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ డ్రస్ లో ఆమె వక్షస్థలం కొంతమేర కనిపిస్తుండటంతో నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. గౌరవప్రదమైన ప్రధాని పదవిలో ఉండి, ఇలాంటి దుస్తులు ఎలా ధరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆమె ప్రధానమంత్రా? లేక మోడలా? అని మండిపడుతున్నారు.
మరోవైపు మారిన్ కు మద్దతుగా కూడా కొందరు నిలుస్తున్నారు. వారు కూడా అలాగే దుస్తులు ధరించి తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఆమె వ్యక్తిగత విషయాల గురించి మనకెందుకని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు మారిన్ కు మద్దతుగా కూడా కొందరు నిలుస్తున్నారు. వారు కూడా అలాగే దుస్తులు ధరించి తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఆమె వ్యక్తిగత విషయాల గురించి మనకెందుకని ప్రశ్నిస్తున్నారు.