సూపర్ ఓవర్ లో 2 పరుగులు చేసి చేజేతులా ఓడిన సన్ రైజర్స్
- ఐపీఎల్ లో ఉత్కంఠభరితంగా మ్యాచ్
- సూపర్ ఓవర్ లో చేతులెత్తేసిన సన్ రైజర్స్
- థ్రిల్లింగ్ మ్యాచ్ లో విజయం సాధించిన కోల్ కతా
అబుదాబిలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ హోరాహోరీగా సాగినా సూపర్ ఓవర్ లో సన్ రైజర్స్ దారుణంగా ఆడింది. సూపర్ ఓవర్ లో కేవలం 2 పరుగులు చేసి తన ఓటమికి తానే కారణమైంది. సూపర్ ఓవర్ లో సన్ రైజర్స్ తరఫున వార్నర్, బెయిర్ స్టో బరిలో దిగారు. అయితే కోల్ కతా బౌలర్ లాకీ ఫెర్గుసన్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వార్నర్ ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సమద్ కూడా బౌల్డ్ కావడంతో 2 పరుగులే వచ్చాయి.
ఇక కోల్ కతా తరఫున దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ సూపర్ ఓవర్ ఆడారు. సన్ రైజర్స్ తరఫున రషీద్ ఖాన్ బౌలింగ్ చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా కోల్ కతా విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.
కాగా. ఈ మ్యాచ్ ద్వారా సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో 5000 వేల పరుగులు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వార్నర్ 135 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత అందుకున్నాడు.