ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా ఎంపిక వచ్చేవారం!
- సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియా వెళుతున్న భారత్
- మధ్యంతర షెడ్యూల్ పై ఆసీస్ నుంచి స్పష్టత రాని వైనం
- నవంబరు 12న టీమిండియా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం
ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతోంది. ఎంతో కఠినమైన ఆసీస్ టూర్ కు వెళ్లే భారత జట్టును వచ్చే వారం ఎంపిక చేయనున్నారు. ఆసీస్ పర్యటనలో టీమిండియా రెండున్నర నెలలు గడపనుంది. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఈ టూర్ పై ప్రాథమిక అంగీకారం కుదుర్చుకున్నాయి.
అయితే ఈ మధ్యంతర షెడ్యూల్ పై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి ప్రకటన రావాల్సి ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. కరోనా నేపథ్యంలో మ్యాచ్ ల నిర్వహణ కోసం ఆస్ట్రేలియాలో క్వీన్స్ లాండ్ రాష్ట్రం ఆమోదం తెలపాల్సి ఉంది. అందుకే ఆసీస్ వైపు నుంచి స్పష్టత రావడంలో ఆలస్యమవుతోంది.
కాగా ఆస్ట్రేలియా కరోనా ప్రోటోకాల్ ప్రకారం టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండడం తప్పనిసరి. క్వారంటైన్ నిబంధన కారణంగా టీమిండియా నవంబరు 12న ఆస్ట్రేలియా పయనమయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ నవంబరు 10న ముగియనుండగా, భారత ఆటగాళ్లు అట్నుంచి అటే ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నారు.