సీఎం వైఎస్ జగన్ క్రైస్తవుడు అనేందుకు ఆధారాలు ఏవి?: పిటిషనర్ ను ప్రశ్నించిన హైకోర్టు
- ఓ పిటిషన్ ను విచారించిన జస్టిస్ దేవానంద్
- ఆధారాలు లేకుండా విచారణ సాధ్యం కాదు
- తదుపరి విచారణ 22కు వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవుడని చెప్పేందుకు ఆధారాలు ఉంటే కోర్టు ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఓ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ ను ఆదేశించారు. తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్ పై దాఖలైన పిటిషన్ ను కోర్టు విచారించింది. ఎటువంటి ఆధారాలూ లేకుండా ముఖ్యమంత్రి హిందువు కాడని, క్రిస్టియన్ అని కోర్టు ముందు ఎలా వాదిస్తారని కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం, సీఎం మతానికి సంబంధించిన పూర్తి వివరాలు లేకుండా వ్యాజ్యం విచారణలో ముందుకు వెళ్లేందుకు వీలు కాదని స్పష్టం చేసింది.
పిటిషనర్ అదనపు ఆధారాలను సమర్పించాలని సూచిస్తూ, తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఇక ఇదే కేసులో గవర్నర్ ను ప్రతివాదిగా చేర్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన ఆయన, గవర్నర్ కు వ్యతిరేకంగా ఎటువంటి అభ్యర్థనలూ కోరలేదని గుర్తు చేశారు. అటువంటి సమయంలో ఆయన్ను ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తూ, ఆయన్ను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చారు.