దేశంలో ఇప్పటికే 30 శాతం మందికి కరోనా.. ఫిబ్రవరికి ఇది 50 శాతానికి చేరే అవకాశం!
- ప్రభుత్వ సీరోలాజికల్ సర్వేతో పోలిస్తే వాస్తవ కేసులు చాలా ఎక్కువ
- సీరోలాజికల్ అంచనాలు వాస్తవానికి అందనంత దూరంలో ఉన్నాయి
- దీపావళి తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది
కరోనా వైరస్ అంచనాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల్లో ఒకరైన అగ్రవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశ జనాభాలో 30 శాతం మంది కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపారు. ఫిబ్రవరి నాటికి ఇది 50 శాతానికి చేరే అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సీరోలాజికల్ సర్వేతో పోలిస్తే... వాస్తవ కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. తక్కువ జనాభాతో సర్వే చేయడం వల్ల సీరోలాజికల్ అంచనాలు వాస్తవానికి అందనంత దూరంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు దేశంలో అధికారికంగా 75 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని... ప్రపంచంలో అమెరికా తర్వాతి స్థానం భారత్ దేనని అగ్రవాల్ చెప్పారు. సగటున ప్రతి రోజు 61,390 కొత్త కేసులు నమోదవుతున్నాయని అన్నారు. సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి అంశాల్లో అలసత్వం వహిస్తే ఒక్క నెలలోనే 26 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీపావళి తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.