వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 113 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 24 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 4 శాతానికి పైగా పెరిగిన హెచ్సీఎల్ టెక్నాలజీస్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత దూకుడు పెంచాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల మేర లాభపడింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో... చివరకు సెన్సెక్స్ 113 పాయింట్ల లాభంతో 40,544 వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 11,897 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.19%), టెక్ మహీంద్రా (3.05%), ఏసియన్ పెయింట్స్ (2.35%), భారతి ఎయిర్ టెల్ (1.91%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.73%).
టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-2.67%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.44%), ఎన్టీపీసీ (-1.22%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.93%), టాటా స్టీల్ (-0.83%).