క్రిష్ సినిమాలో గెస్ట్ పాత్రలో రానా దగ్గుబాటి!
- గెస్ట్ పాత్రల వల్ల బిజినెస్ పరంగా క్రేజ్
- క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ సినిమా
- కథానాయికగా రకుల్.. ప్రత్యేక పాత్రలో రానా
- వికారాబాద్ అడవుల్లో ప్రస్తుతం షూటింగ్
ఒక హీరో సినిమాలో అప్పుడప్పుడు గెస్ట్ పాత్రలో మరో హీరో నటిస్తుండడం మనం చూస్తుంటాం. ఆయా హీరోలు, దర్శకులతో వుండే సంబంధాలను బట్టి ఇలా గెస్ట్ పాత్రలలో మరో హీరో నటిస్తుండడం అన్నది జరుగుతూ వుంటుంది. దీని వల్ల ఆయా సినిమాలకు బిజినెస్ పరంగా క్రేజ్ కూడా పెరుగుతుంది. అందుకే, కథలో కీలకమైన గెస్ట్ పాత్రలను ఇలా మరో ప్రముఖ హీరోతో నటింపజేస్తూ వుంటారు.
ఇప్పుడు టాలీవుడ్ లో రూపొందుతున్న ఓ మెగా హీరో సినిమాలో కూడా ఇలాగే మరో హీరో రానా గెస్ట్ పాత్ర చేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ పవర్ ఫుల్ గెస్ట్ పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం రానాను అడిగారని, దర్శకుడు క్రిష్ తో వున్న అనుబంధం కారణంగా రానా వెంటనే ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ గిరిజన యువతిగా నటిస్తోంది.