1.72 లక్షల ఏళ్ల నాటి అత్యంత పురాతన నదిని గుర్తించిన పురావస్తు శాస్త్రజ్ఞులు
- థార్ ఎడారిలో రాతియుగం నాటి నది
- ల్యూమినిసెన్స్ డేటింగ్ విధానంలో గుర్తించిన వైనం
- నాటి ప్రజలకు ఇది జీవనాడి అని పేర్కొన్న శాస్త్రజ్ఞులు
రాతియుగం నాటి పురాతన నదిని అంతర్జాతీయ పరిశోధకుల బృందం భారత్ లో గుర్తించింది. రాజస్థాన్ లో బికనీర్ లో ఈ నది 1.72 లక్షల ఏళ్ల క్రితం ప్రవహించిందని తెలుసుకున్నారు. ప్రఖ్యాత థార్ ఎడారి మధ్య భాగంలో ప్రవహించిన ఈ నది నాటి రాతియుగం ప్రజలకు జీవనాడిగా విలసిల్లిందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. అంతేకాదు, మానవ వలసలకు ఇది ముఖ్యమైన ప్రాంతంగా నిలిచిందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ పరిశోధనలో పాలుపంచుకున్న జేమ్స్ బ్లింక్ హార్న్ మాట్లాడుతూ, నదిలోని ఇసుక రేణువుల్లో ఉండే క్వార్ట్జ్ రేణువులు చివరిసారిగా ఎప్పుడు కాంతికి గురయ్యాయన్న విషయాన్ని ల్యూమినిసెన్స్ డేటింగ్ విధానం ద్వారా గుర్తించి ఈ నది వయసును అంచనా వేశామని చెప్పారు. కాగా, ఇదే థార్ ఎడారిలోని లునీ లోయలో ఓ నది 80 వేల ఏళ్ల కిందట సజీవంగా ఉండేదని, మాహి, సబర్మతి, ఒర్సాంగ్ ప్రాంతాల్లో లక్ష ఏళ్ల కింద నీరు ప్రహించిన ఆనవాళ్లు కూడా లభ్యమయ్యాయని బ్లింక్ హార్న్ వెల్లడించారు.
ఈ పరిశోధనలో అన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్ హేమా అచ్యుతన్ కూడా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు థార్ ఎడారి కావొచ్చేమో కానీ, ఒకప్పుడు ఇక్కడ అనేక నదులు ప్రవహించాయని తెలిపారు. అయితే ఆ నదులన్నీ ఇసుకదిబ్బల కింద కప్పబడిపోయాయని వివరించారు.